120-crore-loan-scam : ఈయనే విజయవాడ మాల్య Andhra Prabha Top News

120-crore-loan-scam : ఈయనే విజయవాడ మాల్య Andhra Prabha Top News

  • రూ.120 కోట్ల బ్యాంకు కుంభకోణం
  • బ్యాంకులను నిండా ముంచిన నాని.
  • రుణ బకాయిలు, ఆస్తులు చెప్పండి
  • అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి
  • పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆదాయాలకు గండి
  • నిజాలు వెలుగులోకి తెవాలి..
  • మాజీ ఎంపీ నాని పై ఆర్.బి.ఐ చర్యలు తీసుకోవాలి.
  • విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ డిమాండ్​

( ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో )

120-crore-loan-scam

120-crore-loan-scam : విజయవాడ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంకు కుంభకోణం జరిగిందని, దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిన అవసరం ఉందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మాజీ ఎంపీపై పలు ఆరోపణలు చేశారు. దాదాపు రూ.120 కోట్ల రుణాన్ని జాతీయ బ్యాంకు నుంచి తీసుకున్నప్పటికీ 11 సంవత్సరాలుగా సంబంధిత అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. మాజీ ఎంపీ నివాసంగా ఉపయోగిస్తున్న ఇల్లు, విందులు నిర్వహిస్తున్న హోటల్ కూడా బ్యాంకు ఆధీనంలోనే ఉన్నాయని ఆరోపించారు. హోటల్‌ను తనఖా పెట్టి అదనపు రుణాలు పొందారని, ఆస్తుల నుంచి వచ్చే అద్దె ఆదాయాలు వ్యక్తిగత ఖాతాలకు మళ్లుతున్నాయని అన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరును ప్రస్తావిస్తూ ఆయనను కూడా మోసం చేశారని ఆరోపించారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన జీఎస్టీ, ఇతర పన్నులను ఎగవేసే ప్రయత్నాలు జరిగాయని విమర్శించారు. గత కొద్ది రోజులుగా తనపై, తన కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతోందని కేశినేని చిన్ని అన్నారు. తన భార్యతో పాటు పలువురు రాజకీయ నాయకులపై కూడా దుష్ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో సంబంధాలు పెట్టుకుని అధికార పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. విజయవాడలో జరిగినట్లు చెబుతున్న ఆర్థిక వ్యవహారాలపై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని డిమాండ్ చేశారు.

120-crore-loan-scam : విజయవాడ విజయ్ మాల్య ఎవరు

120-crore-loan-scam

విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మాజీ ఎంపీ కేశినేని నాని ఆర్థిక వ్యవహారాలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన చర్చకు దారితీశాయి.
ఈ వ్యాఖ్యలు కేవలం రాజకీయ విమర్శలుగా కాకుండా, ప్రజాధనం, బ్యాంకు రుణాలు, ప్రజా ప్రతినిధుల జవాబుదారీతనానికి సంబంధించిన కీలక ప్రశ్నలను ముందుకు తెస్తున్నాయి. విమర్శలతో తప్పించుకోవడం సరైన విధానం కాదు.
గత కొంతకాలంగా నాపై కూడా అనేక నిరాధార ఆరోపణలు, అసత్య ప్రచారాలు కొనసాగుతున్నాయి. వాస్తవాలను ఎదుర్కోలేని వారు వ్యక్తిగత దూషణలను ఆయుధంగా మార్చుకోవడం కొత్త విషయం కాదు. కానీ ప్రజలు ఇప్పుడు ప్రచారాలను కాదు, ఆధారాలను నమ్మే స్థితికి చేరుకున్నారు. రాజకీయాల్లో విభేదాలు సహజం. కానీ వ్యక్తిత్వ హననం, అసత్య ప్రచారాలు, బురదజల్లే రాజకీయాలు ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తాయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కంటే ప్రజల ముందుకు వాస్తవాలను తీసుకురావడమే నాయకుల బాధ్యత. ప్రజల సొమ్ము, బ్యాంకు రుణాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ప్రతి అంశంపై పూర్తి పారదర్శకత ఉండాలి. అని ఎంపీ చిన్ని సూచించారు.

ALSO READ : Case-Filed : కేశినేని నాని పై కేసు Andhra Prabha Crime News