ఆకట్టుకున్న భక్త ప్రహ్లాద నాటకం..

దండేపల్లి, ఆంధ్రప్రభ : ప్రాచీన కళలు అంతరించిపోతున్న ఈ తరుణంలో దండేపల్లి మండల కేంద్రంలో శనివారం రాత్రి నుండి ఆదివారం తెల్లవారుజాము వరకు నిర్వహించిన భక్త ప్రహ్లాద నాటకం గ్రామస్తులు ఎంతో అలరించింది భీమారంకు చెందిన గోత్రాల కళాకారులు స్థానిక మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన నాటకం ఎంతో ఆకట్టుకుంది. రాత్రి 11 గంటలకు ప్రారంభమైన నాటిక ఆదివారం ఉదయం 6 గంటలకు ముగిసింది. భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు నరసింహ స్వామి పాత్రధారులు కళాకారుల నటన తీరు పలువుని ఆకట్టుకుంది. అనంతరం ఆదివారం కాపు సంఘ సభ్యుల ఇంటింటికి తిరుగుతూ ఆశీర్వచనాలు అందించారు.

Leave a Reply