చరిత్రను తిరగరాసిన విశాఖపట్నం పోర్ట్

చరిత్రను తిరగరాసిన విశాఖపట్నం పోర్ట్

విశాఖపట్నం, ఆంధ్ర‌ప్ర‌భ : 92 ఏళ్ల ఘన చరిత్రలో మరో చారిత్రాత్మక మైలురాయిని సాధించింది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో 90.29 మిలియన్ మెట్రిక్ టన్నుల (90,298,591 ఎంఎంటీ) అత్యధిక వార్షిక సరుకు రవాణాను నమోదు చేసి నూతన రికార్డ్ ను నెలకొల్పింది. గత ఆర్థిక సంవత్సరం 2024–25లో నమోదైన 82.62 ఎంఎంటీ (82,621,459 టన్నులు) రికార్డును అధిగమించి, సరి కొత్త చరిత్రని లిఖించింది. 2026 మార్చి 28న 362 రోజుల్లోనే, లక్ష్యాన్ని చేరుకోవడం విశేషం. విశాఖపట్నం పోర్ట్ సమర్థవంతమైన నిర్వహణ, వ్యూహాత్మక ప్రణాళికలు అన్ని భాగస్వామ్య సంస్థల మధ్య ఉన్న సమన్వయానికి అద్దం పడుతోంది.

ఈ ఘనతలో భాగస్వాములైన ఉద్యోగులు, అధికారులు పోర్ట్ భాగస్వామ్య సంస్థలను చైర్మన్ డా. ఎం. అంగముత్తు, ఐఏఎస్, అభినందించారు. సమిష్టి కృషి, నిబద్ధత వలన ఈ విజయాన్ని సాధించగలిగామని పేర్కొన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న 100 ఎంఎంటీ సరుకు రవాణా లక్ష్యాన్ని సాధించే దిశగా మరింతగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రికార్డు స్థాయి విజయాన్ని సాధించడంలో భాగస్వాములైన ప్రతిఒక్కరిని పోర్ట్ డిప్యూటీ చైర్‌పర్సన్ శ్రీమతి రోష్ని అపరంజి కొరటి, ఐఏఎస్, అభినందించారు. పోర్ట్ కార్యదర్శి శ్రీ శంకర్ బాబు ఈ సమాచారాన్ని మీడియాకు విడుదల చేశారు.

Leave a Reply