ఎంపీజే సమావేశానికి తరలివెళ్లిన నాయకులు..
ఊట్కూర్, ఆంధ్రప్రభ ; హైదరాబాద్ లో నిర్వహించిన ఎంపీజే సమావేశానికి నారాయణపేట జిల్లా నుండి ఎం పీ జే నాయకులుఆదివారంతరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీజే నారాయణపేట జిల్లా అధ్యక్షులు ఖాజీం మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలనే లక్ష్యంతో ఎంపీజే కృషి చేస్తుందని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు సామాజిక బాధ్యతగా తీసుకొని సమస్యలు పరిష్కరిస్తే అభివృద్ధి సాధ్యమన్నారు.
గ్రామాల్లో ప్రతి ఒక్కరూ సోదర భావంతో శాంతియుతంగా కలిసిమెలిసి జీవించాలన్నారు. ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీజే ఊట్కూర్ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ ఖలిక్, నారాయణపేట పట్టణ అధ్యక్షుడు సాజిద్ సిద్ధికి, ఉపాధ్యక్షులు హుస్సేన్ పాషా, సభ్యులు జలాల్ అహ్మద్ తదితరులుపాల్గొన్నారు.
