ఎండల తీవ్రతతో స్విమ్మింగ్ పూల్‌లకు యువత రద్దీ
వికారాబాద్, ఆంధ్రప్రభ : ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో యువకులు, విద్యార్థులు స్విమ్మింగ్ పూల్‌లకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్నేపల్లి ప్రాంతంలో ఉన్న రత్నారెడ్డి గార్డెన్ స్విమ్మింగ్ పూల్ వద్ద సందడి నెలకొంది.
రోజురోజుకు ఉష్ణోగ్రతలు 30 డిగ్రీల సెల్సియస్ పైగా నమోదవుతుండడంతో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు యువత, విద్యార్థులు స్విమ్మింగ్‌కు మొగ్గు చూపుతున్నారు. దీనికి తోడు ఉగాది, రంజాన్ సెలవులు ఉండటంతో మరింత మంది పూల్‌కు చేరుకుంటున్నారు.
విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో స్విమ్మింగ్ చేస్తూ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. దీంతో స్విమ్మింగ్ పూల్ వద్ద కిటకిటలాడే వాతావరణం నెలకొంది.
