కడెంలో సహకార వారోత్సవాలకు శ్రీకారం..

కడెం, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని పాండవాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్)లో సోమవారం సహకార వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. జూన్ 29 నుంచి జూలై 6 వరకు నిర్వహించనున్న ఈ వారోత్సవాలను పాండవాపూర్ పీఏసీఎస్ చైర్‌పర్సన్ రామడుగు శైలజ–రమేష్‌రావు ప్రారంభించి, వారోత్సవాల జెండాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సహకార సంఘాలు గ్రామీణాభివృద్ధి, రైతుల సంక్షేమం, మహిళా సాధికారతకు విశేష సేవలు అందిస్తున్నాయని తెలిపారు. రైతులు సహకార సంఘాల ద్వారా అందుబాటులో ఉన్న సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సీఈఓ ఆశన్న, డైరెక్టర్లు కర్ణాటక రాజన్న, సంతపురి సుగుణ, సిబ్బంది రఘు, రాజేందర్, సాయి తదితరులు పాల్గొన్నారు.