ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై అవగాహన పెరగాలి

ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలపై అవగాహన పెరగాలి

ప్రపంచ పర్యావరణ దినోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన అదనపు కలెక్టర్లు సంగీత, పాండు

సంగారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాల వినియోగం, ఘన వ్యర్థాల వేర్వేరు సేకరణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను జిల్లా కలెక్టరేట్‌లో మంగళవారం అదనపు కలెక్టర్లు టి.ఎల్. సంగీత, పాండు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, వస్త్ర సంచులు, కాగితం సంచులు వంటి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సూచించారు.

ఇంటి వద్దనే తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించడం ద్వారా వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా జరుగుతుందని తెలిపారు. పరిశుభ్రమైన పరిసరాల నిర్మాణంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై ప్రతి కుటుంబం అవగాహన పెంచుకుని, ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఈఈ ఎన్. విజయలక్ష్మి, కలెక్టరేట్ ఏఓతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply