పదవీ విరమణ పొందిన అధికారికి సన్మానం…

పదవీ విరమణ పొందిన అధికారికి సన్మానం…
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : గుబ్బల వెంకటేశ్వరరావు సూపరింటెండెంట్ సర్వే, జిఎం కార్యాలయంలో వీరు సుదీర్ఘకాలంగా సింగరేణికి సేవలు అందించి పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా జనరల్ మేనేజర్ కార్యాలయ సిబ్బంది పదవి విరమణ వీడ్కోలు సన్మాన సభను ఎల్లందు క్లబ్ లో జి.ఎం, ఎన్,రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జనరల్ మేనేజర్ ఎన్.రాధాకృష్ణ, మాట్లాడుతూ పదవీ విరమణ అనేది ప్రతి ఒక్క ఉద్యోగి కి అనివార్యమని అన్నారు. ఈ సందర్భంగా గుబ్బల వెంకటేశ్వరరావు సూపరింటెండెంట్ సర్వే, జిఎం కార్యాలయంలో వీరు చేసిన సేవలను కొనియాడారు. పదవి విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్.ఓ.టు జి.ఎం జి, ఎల్ ప్రసాద్, డిజిఎం. పర్సనల్ అశోక్, ఏరియా సర్వే ఆఫీసర్ దేశాయ్, జి.ఎం కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
