ఫాస్ట్ ట్రాక్ ఫారెస్టు చెక్ పోస్టులను ఎత్తివేయాలని రాస్తారాకో..

జన్నారం, ఆంధ్రప్రభ : అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఫాస్ట్ ట్రాక్ చెక్ పోస్ట్ లను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా జన్నారం మండల బీజేపీ ఆధ్వర్యంలో తపాలాపూర్ చెక్ పోస్ట్ వద్ద శనివారం మధ్యాహ్నం నేతలు రాస్తారోకో నిర్వహించారు.ఈ సందర్భంగా బీజేపీ మండలాధ్యక్షుడు జి.మధుసూదన్ రావు మాట్లాడుతూ.. ఫాస్ట్ ట్రాక్ పేరుతో అటవీశాఖ అధికారులు వాహనదారుల డబ్బులు వసూలు చేయడం తగదన్నారు.

కవ్వాల టైగర్ రిజర్వులోని పాండ్వాపూర్,కొత్తగూడెం, ఇందనపల్లి,తపాల్ పూర్ వద్ద ఏర్పాటుచేసిన ఫాస్ట్ ట్రాక్ ఫారెస్ట్ చెక్పోస్టులను వెంటనే ఎత్తువేయాలని, లేనియెడల ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పార్టి జిల్లా కార్యదర్శి కొంతం శంకరయ్య,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర బద్రినాయక్,పార్టి మండల ప్రధాన కార్యదర్శి ఎరుకల రమేష్ గౌడ్, పొనకల్ ఉపసర్పంచి అప్పాల జలపతి,నాయకులు గోలి చందు,సామల లక్ష్మీరాజం,రవి,పవన్ యాదవ్,జగన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply