అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం..
మైనార్టీ రెసిడెన్షియల్ అసోసియేషన్ వైస్ చైర్మన్ ఫయీం ఖురేషి
నిర్మల్ ప్రతినిధి, ఆంధ్రప్రభ : రంజాన్ మాసం పురస్కరించుకొని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్ ఆర్ గార్డెన్లో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అర్జుమాంద్ అలీ ఆధ్వర్యంలో మంగళవారం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మైనార్టీ రేషడెన్షియల్ అసోసియేషన్ వైస్ ఛైర్మెన్ ఫహీం కురేషి హాజరై మాట్లాడారు . తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ చక్రవర్తి, గ్రంధాలయ ఛైర్మెన్ అర్జుమాంద్ హైదరాబాద్ వెళ్లి హజ్ హౌస్, ఈద్గా కొరకు స్థలం కేటాయించాలని విన్నవించడంతో ముఖ్యమంత్రితో మాట్లాడి వక్ఫ్ స్థలం నుండి హజ్ హౌస్ కు రెండు ఎకరాలు, ఈద్గా కు 5 ఎకరాల స్థలాన్ని మంజూరు చేయించిన ప్రొసిడింగ్ పత్రాలను వైస్ చైర్మన్, గ్రంధాలయ ఛైర్మెన్లకు అందజేశారు. మును ముందు నిర్మల్ అభిద్ధికి తన వంతు సహకారం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సత్తు మల్లేష్. మాజీమంత్రి ఆలోల ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ నియోజకవర్గం ఇంచార్జ్ కే శ్రీహర్ రావు. సాజిద్ ఖాన్.అజార్ ఇమ్రానుల్ల. హతిక్ హైమద్ తదితరులు పాల్గొన్నారు
