ఖానాపూర్‌లో కాంగ్రెస్‌కు చేరికల జోరు..

కడెం, ఆంధ్రప్రభ: నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమక్షంలో పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

పెద్దూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దికొండ విజయ్ కుమార్, ఉప సర్పంచ్ పిట్టల రాజన్న, పలువురు వార్డు సభ్యులు, కన్నాపూర్ గ్రామ సర్పంచ్ ముల్కల శంకర్‌తో పాటు వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా వేసి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి చేపడుతున్న చర్యలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిపారు.

ఎమ్మెల్యే బొజ్జు పటేల్ మాట్లాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో నిర్మల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి పి. సతీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్ గుప్తా, యూత్ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ముడికే మల్లేష్, ఆర్టీఏ సభ్యుడు తుమ్మల మల్లేష్, కడెం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎండీ వాజిద్, కాంగ్రెస్ నాయకులు కోల శ్రీనివాస్, వి. సత్యం, పడిగల రాజు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply