తల్లిపాలే శిశువుకు ఉత్తమ పోషణ
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా అవగాహన కార్యక్రమం
వికారాబాద్, ఆంధ్రప్రభ: ప్రతి తల్లి తన శిశువుకు తప్పనిసరిగా తల్లిపాలు అందించాలని అంగన్‌వాడీ టీచర్ మనోహర సూచించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్ప అంగన్‌వాడీ కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా మనోహర మాట్లాడుతూ, తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రతి తల్లికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. పుట్టిన గంటలోనే శిశువుకు తల్లిపాలను ప్రారంభించి, తొలి ఆరు నెలల పాటు పూర్తిగా తల్లిపాలనే అందించడం వల్ల శిశువు ఆరోగ్యవంతంగా ఎదుగుతాడని వివరించారు. కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
