జాతీయ స్థాయిలో మోత్కుపల్లి గ్రామానికి మూడో స్థానం..

వికారాబాద్, ఆంధ్రప్రభ : జాతీయస్థాయి పంచాయతీరాజ్ అవార్డుల్లో వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండలంలోని మోత్కుపల్లి గ్రామం మూడో స్థానం సాధించినట్లు జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో గ్రామానికి గుర్తింపు లభించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేస్తూ, గ్రామ సర్పంచ్ అమృతను అభినందించారు.

గ్రామాభివృద్ధి, పారిశుధ్యం, ప్రజా భాగస్వామ్యం తదితర అంశాల్లో గ్రామం చూపిన ప్రతిభకు ఈ అవార్డు దక్కడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ సుధీర్, జిల్లా పంచాయతీరాజ్ అధికారి జయసుధ, డీఎల్‌పీఓ అనిత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply