జాతీయ రహదారిపై ప్రమాదం

జాతీయ రహదారిపై ప్రమాదం
- స్కూటర్‌దారికి తీవ్ర గాయాలు
కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : 216 జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. సంఘముడి గ్రామ సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద బంటుమిల్లి వైపు నుంచి పల్లెపాలెం వైపు వెళుతున్న కారు, స్కూటర్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తిని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో స్కూటర్‌దారికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తిని నీలిపూడి గ్రామానికి చెందిన బోడియ్యగా స్థానికులు గుర్తించారు. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా అతడిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
