జిల్లాలో పెట్రోల్, డీజల్‌కు కొరత లేదు..

జిల్లాలో పెట్రోల్, డీజల్‌కు కొరత లేదు..

పెట్రోల్, డీజిల్ లేదని అసత్య ప్రచారాలు చేయొద్దు
జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
పెట్రోల్ బంకులలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

శ్రీకాకుళం, ఆంధ్ర‌ప్ర‌భ : జిల్లాలో పెట్రోల్, డీజిల్ కు కొరత లేదని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పునరుద్ఘాటించారు . మంగళవారం శ్రీకాకుళం నగరంలో గల బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్, రైతు బజార్ పక్కన గల ఇండియన్ ఆయిల్ బంక్, డే అండ్ నైట్ దగ్గర గల హెచ్ పీ బంకులను ఆయన తనిఖీ చేశారు . ఆయిల్ అయిపోక ముందే ఇండెంటెడ్ పెట్టినందున వలన ఆయిల్ వెంటనే వచ్చిందని, బంకు యాజమానులను ఆయన అభినందించారు.

నిన్న ఎంత ఆయిల్ వేయించారు.. ఈ రోజు ఎంత పెట్రోలు వేయించారో వాహన చోదకులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 5 పెట్రోల్ బంకుల్లో ఆయిల్ లేకపోతే విశాఖపట్నం నుండి వెంటనే వచ్చిందన్నారు. అమ్ముకునే వారికి పెద్ద మొత్తంలో ఆయిల్ వేయవద్దని ఆదేశించారు. రైతు బజార్ వద్ద గల పెట్రోల్ బంకులో 8 వేల లీటర్లు అందుబాటులో ఉందన్నారు. ఆయిల్ ఉంటుండగానే పెట్రోల్ కంపెనీకి ఇండెంటెడ్ పెట్టుకున్నట్లు తెలిపారు .

అన్ని బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు జరుగుతున్నట్లు చెప్పారు.ఇందుకోసం కలెక్టరేట్ లో ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. పెట్రోల్ బంకులు వద్ద ఒక విఆర్ఓ, పోలీసు ఉంటారన్నారు. కొన్ని బంకులకు ఒక స్పెషల్ ఆఫీసర్ ను నియమించినట్లు వివరించారు. పెట్రోల్, డీజిల్ లేదని ఎవరూ అసత్య ప్రచారం చేయొద్దన్నారు.

మత్స్యకారులు, రైతులకు సంబంధించి సంబంధిత సచివాలయాల అసిస్టెంట్లు కూపన్లు జారీ చేస్తారని, వారు అందుబాటులో లేని పక్షంలో బంకులు వద్ద ఉన్న విఆర్ఓ లు కూపన్లు జారీ చేస్తారన్నారు. విఆర్ఓ, సచివాలయాల సంబంధిత అసిస్టెంట్లు కో ఆర్డినేట్ చేసుకోవాలన్నారు. పెట్రోల్ డీజిల్ లకు ఏ విధమైన కొరత లేదన్నారు. కలెక్టర్అ వెంట సిస్టెంట్ కలెక్టర్ హరి ఓం పాండియ, తదితరులు ఈ తనిఖీలలో పాల్గొన్నారు.

Leave a Reply