West Bengal | దీదీకి షాక్… 25వేల మంది టీచర్ల నియామకం రద్దు

ఢిల్లీ: బెంగాల్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన టీచర్ల నియామకాలపై కలకత్తా హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ రాష్ట్రంలో 2016లో జరిగిన 25వేల టీచర్ల నియామకాలను కలకత్తా హైకోర్టు గతంలో రద్దు చేసింది. ఈక్రమంలో విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకునేందుకు సరైన కారణాలు లేవని పేర్కొంది. మూడు నెలల్లో కొత్తగా టీచర్ల నియామకాలు చేపట్టాలని ఆదేశించింది. టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగినట్లు గతంలో పిటిషన్లు కోర్టును ఆశ్రయించారు..

ఈ తీర్పును అంగీకరించను – మమతా బెనర్జీ

సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. న్యాయ వ్యవస్థపై తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని.. అయినప్పటికీ ఈ తీర్పును అంగీకరించబోమని అన్నారు..

Leave a Reply