HYD22 Carats | బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు
HYD22 Carats | బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు
HYD22 Carats | రోజురోజుకూ మారుతున్న గోల్డ్ రేట్లు
హైదరాబాద్‌లో తాజా బంగారం ధరలు
వెండి ధరలో స్థిరత్వం
పెళ్లిళ్ల సీజన్‌లో కొనుగోలుదారులకు టెన్షన్
HYD22 Carats | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : బంగారం ధరలు ఏ రోజు ఎలా ఉంటాయో అర్ధం కావడం లేదు. ఒక రోజు తగ్గితే.. మరుసటి రోజు పెరుగుతున్నాయి. గోల్డ్ రేట్ల హెచ్చు తగ్గుదలతో కొనుగోలు దారులు అయోమయానికి గురవుతున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ బంగారం కొనుగోలు తప్పనిసరి. ఇలాంటి సమయంలో స్థిరత్వం లేని బంగారం ధరలతో విక్రయదారులు టెన్షన్‌కు లోనవుతున్నారు. తగ్గుతుందనుకునే లోపే ధరలు మళ్లీ పైకి ఎగబాకుతున్నాయి.

హైదరాబాద్‌లో 22 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరిగింది. ప్రస్తుతం ధర రూ. 1,38,750 వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 440 పెరిగింది. ప్రస్తుతం తులం రూ. 1,51,370 వద్ద ఉంది. మరోవైపు వెండి ధర మాత్రం హైదరాబాద్ మార్కెట్లో స్థిరంగానే ఉంది. కేజీకి రూ. 2.65 లక్షల వద్ద కొనసాగుతోంది. కిందటి రోజు రూ. 5 వేలు తగ్గింది.
హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధరలు (29 ఏప్రిల్ 2026):
24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 1,51,370
22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ. 1,38,750
18 క్యారెట్ల బంగారం (10 గ్రాములు): రూ.1,13,530

పైన పేర్కొన్న ధరలు పన్నులు, మేకింగ్ ఛార్జీలు మరియు ఇతర అదనపు ఖర్చులను కలిగి ఉండవు. మీ స్థానిక నగల దుకాణంలో ధరలు కొద్దిగా భిన్నంగా ఉండవచ్చు.
