రైతు సంక్షేమం,సహకార అభివృద్దే లక్ష్యం..
గంపలగూడెం, ఆంధ్రప్రభ : రైతు సంక్షేమం,సహకార అభివృద్ధి,గ్రామ అభివృద్ధి అనే లక్ష్యంతో కృష్ణా మిల్క్ యూనియన్ ముందుకు సాగుతుందని యూనియన్ చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు.ఆయన శనివారం మండలంలోని ఆర్లపాడు గ్రామంలో రైతులతో అవగాహన సదస్సు నిర్వహించారు.పాడి రైతుల అభివృద్ధి,సహకార పాల ఉద్యమ బలోపేతం,గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పురోగతే కృష్ణ మిల్క్ యూనియన్ లక్ష్యం అని అన్నారు.
గ్రామాల్లో రైతు కుటుంబాలు ఆర్థికంగా బలపడాలంటే పాడి పరిశ్రమ అభివృద్ధి చెందాలని,పాడి రైతు ప్రతి రోజు కష్టపడి ఉత్పత్తి చేసే పాలకు సరైన గౌరవం,సరైన ధర, సమయానికి చెల్లింపు అందించడమే మా బాధ్యత అని అన్నారు. యూనియన్ రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తూ, పాలధరల పెంపు,బోనస్‌లు, పశువైద్య సేవలు,పశుగ్రాస అవగాహన,ఆధునిక పాడి పద్ధతులపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. మొబైల్ వ్యాన్ ద్వారా ఉచిత క్యాంపులు అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంఘాల అధ్యక్షులు శైలజ, సతీష్, క్లస్టర్ మేనేజర్ ప్రసాద్, సూపర్వైజర్బి .నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.
