దేవాలయ పరిపాలన విధానాలపై సిటాలో అధ్యయనం

విజయవాడ, ఆంధ్రప్రభ: సీతానగరం వద్ద ఉన్న రాష్ట్ర దేవాలయ పరిపాలన సంస్థ (సిటా) కార్యాలయాన్ని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు బుల్లి అబ్బాయి, రాఘవరాజు సందర్శించారు.

ఈ సందర్భంగా సిటా కార్యాలయంలోని అధికారులతో సమావేశమై అక్కడ అమలవుతున్న పరిపాలనా విధానాలు, నిర్వహణ వ్యవస్థ, వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. దేవాలయాల నిర్వహణలో సాంకేతికత వినియోగం, ఆధునిక పరిపాలనా విధానాలు, భక్తులకు అందిస్తున్న సేవలపై అధికారులతో చర్చించారు.

దేవాలయాల అభివృద్ధి, భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు చేపడుతున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు. అలాగే పరిపాలనా వ్యవస్థలో అమలవుతున్న పలు విధానాలపై ఆసక్తి వ్యక్తం చేస్తూ, వాటి ప్రయోజనాలను అడిగి తెలుసుకున్నారు.

దేవాలయాల నిర్వహణలో పారదర్శకత, సాంకేతికత వినియోగం, సేవల మెరుగుదలకు సంబంధించిన అంశాలపై అధికారులు ట్రస్ట్ బోర్డు సభ్యులకు వివరణ ఇచ్చారు