హరీష్ రావుపై ప్రభుత్వ విప్ విజయ రమణారావు తీవ్ర విమర్శలు..
హరీష్ రావుపై ప్రభుత్వ విప్ విజయ రమణారావు తీవ్ర విమర్శలు..
పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: మాజీ మంత్రి హరీష్ రావు ఓ అబద్ధాలకోరు అని ప్రభుత్వ విప్ విజయ రమణారావు తీవ్రంగా విమర్శించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై మతిభ్రమించి వ్యాఖ్యలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని, అధికారం కోల్పోయామనే ఫ్రస్ట్రేషన్‌లో హరీష్ రావు అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
రైతు డిస్కంలతో సోలార్ పంపు సెట్లను ప్రోత్సహించి విద్యుత్ ఆదా చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయమని చేసిన సవాల్‌పై హరీష్ రావు, కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోచుకున్న మామా అల్లుళ్లకు కాంగ్రెస్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆయన వ్యాఖ్యానించారు. మరోసారి ప్రభుత్వంపై అబద్ధాలు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు.
