NIA Custody | ఎన్‌ఐఏ కస్టడీలోకి ఉగ్ర లింక్ నిందితులు
NIA Custody | ఎన్‌ఐఏ కస్టడీలోకి ఉగ్ర లింక్ నిందితులు
విజయవాడ కేసులో కీలక మలుపు
NIA Custody | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : విజయవాడ ఉగ్రవాద లింక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నిందితులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కస్టడీలోకి తీసుకుంది.
ఎన్‌ఐఏ అధికారులు నిందితులను రాజమండ్రిలోని జాంపేట మహిళా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కోర్టు అనుమతితో చేపడుతున్న ఈ కస్టడీ విచారణ నేటి నుంచి ప్రారంభమైంది. నిందితులను ఐదు రోజుల పాటు ఎన్‌ఐఏ అధికారులు విస్తృతంగా విచారించనున్నారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు, నిధుల లావాదేవీలు, స్థానికంగా ఉన్న నెట్‌వర్క్‌లపై ఆరా తీయనున్నట్లు సమాచారం.
ఈ కేసులో ఇప్పటికే పలు కీలక ఆధారాలు సేకరించిన ఎన్‌ఐఏ, కస్టడీ విచారణ ద్వారా మరిన్ని వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తోంది. విచారణలో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
