Kaushik Reddy | క్యాంప్ కార్యాలయం వద్ద ఘర్షణ

Kaushik Reddy | క్యాంప్ కార్యాలయం వద్ద ఘర్షణ
Kaushik Reddy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి క్యాంపు కార్యాలయం వద్ద ఇవాళ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. బీజేపీ శ్రేణులు క్యాంపు ఆఫీస్ వైపు దూసుకెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది.
పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగి బీజేపీ శ్రేణులను అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. ఉదయం బండి సంజయ్‌పై పాడి కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు పాడి కౌశిక్‌రెడ్డిని అరెస్టు చేశారు. ఘటనతో హుజూరాబాద్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
