Vizianagaram | ప‌ట్టాలు త‌ప్పిన నాగావ‌ళి ఎక్స్ ప్రెస్..

విజ‌య‌న‌గ‌రం నుంచి బొబ్బిలి వెలుతుండగా ప్రమాదం
చివ‌రి రెండు బోగీలు డిరైల్
రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం

విజ‌య‌న‌గ‌రం -నాగావళి ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. విజయనగరం రైల్వేస్టేషన్‌కు దగ్గర్లో నేడు ఈ ఘటన చోటుచేసుకుంది. ప్యాసింజర్లతో వెళ్తున్న ట్రెయిన్ విజయనగరం నుంచి బొబ్బిలి వైపు వస్తుండగా పట్టాలు తప్పింది. వెంటకలక్ష్మీ థియేటర్ కూడలి దగ్గర నాగావళి ఎక్స్‌ప్రెస్‌లోని చివరి రెండు బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ట్రెయిన్ స్లోగా వెళ్లడంతో అందులోని ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు. ఘటన గురించి తెలియగానే రంగంలోకి దిగిన రైల్వే అధికారులు.. ప్రయాణికుల కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే రైళ్ల రాక‌పోక‌ల‌కు అంత‌రాయం క‌లిగింది.

Leave a Reply