కనకదుర్గమ్మ ఆలయానికి రూ.5 లక్షలకు పైగా విరాళాలు

ఇంద్రకీలాద్రి ఆంధ్రప్రభ : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ నిత్య అన్నదాన, ఆలయ అభివృద్ధి నిధులకు పలువురు భక్తులు ఆదివారం భక్తిశ్రద్ధలతో రూ.5,00,232 విరాళాలు సమర్పించారు.

తిరువూరుకు చెందిన వి.వి. మనుబ్రహ్మచారి రూ.1,00,116, ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లికి చెందిన కంచర్ల బెనర్జీ కుటుంబ సభ్యులు రూ.1,00,116, విశాఖపట్నం జిల్లా పెదగంట్యాడకు చెందిన వై. యోహిత్ రూ.1,00,000, హైదరాబాద్‌ సరూర్‌నగర్‌కు చెందిన వి. వీరప్రకాష్ కుటుంబ సభ్యులు రూ.1,00,000లను ఆలయ నిత్య అన్నదాన విభాగానికి విరాళంగా అందజేశారు.

అలాగే చిత్తూరు జిల్లా మదనపల్లి ప్రశాంతి నగర్‌కు చెందిన ఇందుకూరి నరేష్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆలయ అభివృద్ధి నిధికి రూ.1,00,000 విరాళం సమర్పించారు. ఈ విరాళాలను ఆలయ చైర్మన్ బొర్రా గాంధీ అధికారులు, అర్చకుల సమక్షంలో భక్తిపూర్వకంగా అందజేశారు.