AN32 Crash Assam | ప్రమాదంపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ

AN32 Crash Assam | ప్రమాదంపై కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీ

AN32 Crash Assam | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: అస్సాంలో భారత వైమానిక దళానికి చెందిన ఏఎన్-32 ట్రాన్స్‌పోర్ట్ విమానం ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో వాయుసేనకు చెందిన ఐదుగురు మృతి చెందినట్లు సమాచారం.

మృతుల్లో ఇద్దరు వాయుసేన అధికారులు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో వ్యక్తి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై భారత వైమానిక దళం తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను గుర్తించేందుకు కోర్ట్ ఆఫ్ ఎంక్వయిరీకి ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.