Visakhapatnam | కేజీహెచ్‌లో అగ్ని ప్రమాదం..
తప్పిన భారీ ప్రమాదం…
Visakhapatnam | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం (Visakhapatnam) కేజీహెచ్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. ఏసీలో షార్ట్ సర్క్యూట్ కావడంతో కార్డియాలజీ విభాగం (Cardiology Department) లో స్వల్పంగా మంటలు చెలరేగాయి. మంటలు రావడంతో 43మంది పేషెంట్లను అక్కడి నుంచి తరలించారు. కంప్యూటర్లు, టేబుళ్లు దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

