Patamata | లోకేష్ జన్మదిన వేడుకలు..

Patamata | పటమట, ఆంధ్రప్రభ : తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ నగరంలోని 8వ డివిజన్‌లో పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. డివిజన్ పార్టీ అధ్యక్షుడు కొత్తపల్లి రమేష్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమంతో పాటు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా స్థానిక కార్పొరేటర్ చెన్నుపాటి ఉషారాణి, ఏఎంసీ డైరెక్టర్ ధూళిపాళ్ల రమేష్ పాల్గొని, లోకేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. యువత ఆశా కిరణంగా ఎదుగుతున్న లోకేష్ నాయకత్వం రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతోందని వారు పేర్కొన్నారు.

ఈ వేడుకల్లో డివిజన్ పార్టీ ప్రధాన కార్యదర్శి నారు రామారావు, పార్టీ నాయకులు మల్లెల రామకృష్ణ, దేవపొంగు కృపారావు, సిగబండి శివయ్య, బద్దూరి వీరారెడ్డితో పాటు స్థానిక నాయకులు, పార్టీ అభిమానులు, బూత్ ఇన్‌చార్జీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాల్గొన్న నేతలు లోకేష్ ప్రజాసేవ పట్ల చూపుతున్న నిబద్ధతను కొనియాడుతూ, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం పార్టీ శ్రేణులు సమిష్టిగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply