Pedana | రైతన్నామీకోసంలో ఎమ్మెల్యే
Pedana | కృత్తివెన్ను, ఆంధ్రప్రభ : పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రకా గ్రామంలో “రైతన్నా మీకోసం” కార్యక్రమంలో శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. లాభసాటి వ్యవసాయం కోసం సీఎం ప్రకటించిన నీటి భద్రత, డిమాండ్ Demand ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అనే పంచ సూత్రాల గురించి అన్నదాతలకు వివరించారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, రైతులు, ప్రజా ప్రతినిధులు, నేతలు, అధికారులు పాల్గొన్నారు.

