వనమహోత్సవంలో ఇంటింటికీ ఆరు మొక్కల పంపిణీ
చిట్యాల, ఆంధ్రప్రభ : గ్రామంలోని ప్రతి ఇంటి పరిసరాలు పచ్చదనంతో కళకళలాడేలా తీర్చిదిద్ది చిన్నకాపర్తిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకుందామని గ్రామ సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ పిలుపునిచ్చారు.
వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో సర్పంచ్ ఆవుల సుందర్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు ఇంటింటికీ ఆరు మొక్కల చొప్పున పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ప్రతి కుటుంబం మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘు, పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, వార్డు సభ్యులు ఈరమల్ల దయాకర్, వలిగొండ కవిత సత్యనారాయణ, రొండి నరసింహ, దేశపాక మధు, పెరిక నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
