ఇన్చార్జి అధికారులే శరణ్యం…..

ఇన్చార్జి అధికారులే శరణ్యం…..
బిచ్కుంద మండల పరిషత్ కార్యాలయం. దుస్థితి……
బిచ్కుంద. (కామారెడ్డి) ఆంధ్రప్రభ : ఇంచార్జ్ అధికారులే శరణ్యం బిచ్కుంద మండల పరిషత్ కార్యాలయం దుస్థితి అని మండల ప్రజలు వాపోతున్నారు. ప్రభుత్వ పథకాలు గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు నేరుగా చేరాలంటే పర్మినెంట్ అధికారులు ఉంటే అభివృద్ధి సాధ్యమని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తనదైన శైలిలో అభివృద్ధి దిశలో దూసుకెళ్తుంటే అధికారులు మాత్రం ఇన్చార్జిల పాలనతో సరైన న్యాయం లబ్ధిదారులకు అందటం లేదని పలువురు ప్రజలు చర్చించుకుంటున్నారు.
బిచ్కుంద మండల అభివృద్ధి అధికారి బిచ్కుంద నుండి డోంగ్లి మండలానికి డిప్యూటేషన్ పై వెళ్లడంతో స్థానిక సూపర్డెంట్ ఇన్చార్జి ఎంపీడీవో గా బాధ్యతలు స్వీకరించారు. అదనపు భారమైన ఉండడంతో అటు సూపర్డెంట్ గా ఇంచార్జ్ ఎంపీడీవో గా ఉండటంతో పని భారం ఎక్కువైంది. జిల్లాస్థాయి నుండి పలు వీడియో కాన్ఫరెన్స్లో ఉండటం వలన గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సరైన న్యాయం అందడం లేదని పలువురు ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ విధులు నిర్వహించిన ఎంపీఓను ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్ పై వేసి ఇంచార్జి ఎంపీ ఓగా ఇతర ప్రాంతం నుండి బిచ్కుంద ఎంపీ ఓ గా విధులు నిర్వర్తిస్తున్నారు.
మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీరాజ్ ఏఈ ఇంచార్జ్, ఐపిస్టులు కూడా ఇంచార్జ్, నలుగురు అటెండర్లు ఉండరా ఇద్దరిని ఇతర ప్రాంతాలకు డిప్యూటేషన్ పై వెళ్లడంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పలు గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. బిచ్కుంద నుండి డిప్యూటేషన్ పై వెళ్లి న ఎంపీడీవో ను, ఎంపీవోను ఇద్దరు అటెండర్ లను టైపిస్టు బిచ్కుంద లోనే పర్మినట్టుగా విధులు నిర్వర్తించేలా చర్యలు చేపట్టాలని పలు గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పంచాయతీరాజ్ ఏఈ పలు శాఖల అధికారులు పర్మనెంట్ గా విధులు నిర్వర్తించేలా, ఉన్న అధికారులకు పని భారం తగ్గించాలని అయితే ప్రభుత్వం చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు, ఉపాధి హామీ పథకం పలు పథకాలు లబ్ధిదారులకు సక్రమంగా చేరుతాయని ప్రజలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ను కోరుతున్నారు.
గత రెండు సంవత్సరాలు గా తనదైన శైలిలో ఎమ్మెల్యే బిచ్కుంద మండల కేంద్రాన్ని మున్సిపల్ గా ఏర్పాటు చేశారని, అదనంగా గ్రామీణ ప్రాంతాలకు రోడ్లకు మంజూరు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నారంటే ఆయనకే సాధ్యం మండల ప్రజలు అంటున్నారు. ప్రతి మండలానికి ప్రజా దర్బార్ పెట్టి మండల ప్రజల కష్టాలను దూరం చేస్తారని మండల ప్రజ లు ఎంతో ఆశతో ఎదురుచూ స్తున్నారు.
