గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థులకు సన్మానం

గురుకుల పాఠశాలకు ఎంపికైన విద్యార్థులకు సన్మానం

ఊట్కూర్, ఆంధ్రప్రభ: నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని గీతాంజలి గ్రామర్ పాఠశాలకు చెందిన 14 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలలో సీట్లు సాధించడంతో పాఠశాల యాజమాన్యం, ప్రజాప్రతినిధులు బుధవారం ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఎం భాస్కర్, ఉప సర్పంచ్ రమేష్, జిల్లా వాణిజ్య సెల్ కన్వీనర్ కృష్ణయ్యగౌడ్ లు మాట్లాడుతూ… విద్యార్థులు ఇష్టపడి చదువుతూ ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు. గీతాంజలి గ్రామర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఒకేసారి 14 మంది సీటు సాధించడం శుభసూచకమన్నారు.

ప్రతి విద్యార్థి అనుకున్న లక్ష్యాలను చేరుకునేందుకు చదువుతోపాటు వివిధ రంగాల్లో రాణించాలని అన్నారు. ఊట్కూర్ మండల చరిత్రలో ఒకే ఏడాదిలో 14 మంది విద్యార్థులు ఎంపిక కావడం పాఠశాలకే గర్వకారణంఅన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎం భరత్, పాఠశాల కరస్పాండెంట్ అవినాష్, హెచ్ఎం నాగవేణి ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply