ముమ్మరంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) సర్వే
భీమ్గల్ టౌన్, ఆంధ్రప్రభ : భీమ్గల్ పట్టణంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) కార్యక్రమం ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ సర్వేలో భాగంగా బీఎల్ఓ సూపర్వైజర్లు, బీఎల్ఓలు, బీఎల్ఏలు ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలను పంపిణీ చేస్తూ ఓటర్ల వివరాలను సేకరిస్తున్నారు.
అర్హులైన ప్రతి పౌరుడు ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునేలా చూడడం, డూప్లికేట్ ఓట్లను గుర్తించి తొలగించడం ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు తెలిపారు.
ప్రజలు ఎన్యుమరేషన్ ఫారాలను సక్రమంగా పూరించి సంబంధిత అధికారులకు అందజేయడంతో పాటు అవసరమైన పత్రాలను సమర్పించి సర్వేకు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ప్రజల సహకారంతో పారదర్శకమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితాను రూపొందించేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని తహసీల్దార్ కిరణ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, ఎలక్షన్ డీటీ అశ్విన్ బాబు, ఆర్ఐ మల్లేష్, జూనియర్ అసిస్టెంట్ రజిత తదితరులు పర్యవేక్షించారు.
