Veldurthi | ముగ్గుల పోటీలతో చైత‌న్యం

Veldurthi | ముగ్గుల పోటీలతో చైత‌న్యం

  • ఎమ్మెల్యే సతీమణి శోభారాణి

Veldurthi | వెల్దుర్తి, ఆంధ్రప్రభ : మహిళలలో చైతన్యం తేవడానికి సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని రంగవల్లుల పోటీలు నిర్వ‌హించిన‌ట్లు ఎమ్మెల్యే సతీమణి జూలకంటి శోభారాణి శుక్రవారం అన్నారు. ఈ ముగ్గుల పోటీలలో పాల్గొనేందుకు మహిళలు చైతన్యవంతులై ముందుకొచ్చి ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో పాల్గొన్న మహిళలు రంగురంగుల ముగ్గులను వేసి ప్రతి ఒక్కరిని ఆకర్షింపచేశారు. మండల కేంద్రంలోని సీతారాముల దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా జూలకంటి గౌతమ్ రెడ్డి దంపతులు హాజర‌య్యారు. మహిళలు వేసిన ముగ్గుల పోటీలను పరిశీలించి గెలుపొందిన మహిళా మణులకు బహుమతులను అందజేశారు.

ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ.. హిందూ సనాతన ధర్మంలో ప్రతి పండుగలో ఘనంగా జరుపుకునేందుకు మహిళలు ముందుండాలన్నారు. ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి మహిళకు బహుమతులు అందజేశారు. ఈ పోటీలను ఏర్పాటు చేసినందుకు మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళలు, గృహిణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply