ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీ కొట్టిన వైనం

ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీ కొట్టిన వైనం

  • ఒకరు మృతి 10 మంది తీవ్రగాయాలు
  • బస్సులో 30 మంది ప్రయాణికులు
  • అతివేగమే ఈ ప్రమాదానికి కారణం
  • బస్సు అరుణాచలం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ ; నంద్యాల చిత్తూరు జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జయ భారత్ ట్రావెల్స్ (జె బి టీ ) ట్రావెల్ బస్సు అరుణాచలం నుంచి హైదరాబాదుకు వెళ్తుండగా ముందుగా వెళుతున్న బొగ్గు లారీని ఢీకొట్టింది. కిటికీ పక్కన కూర్చున్న చిత్తూరుకు చెందిన సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందాడు. పదిమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అందులో కొందరిని ప్రభుత్వ ఆసుపత్రికి మరికొందరిని ప్రవేట్ ఆసుపత్రికి తరలించారు. ఆళ్లగడ్డ డి.ఎస్.పి శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు జాతీయ రహదారిపై బొగ్గు లారీ లోడ్ వెళ్తుండగా అతివేగంగా వెనకనుంచి వచ్చి ఢీకొట్టిందన్నారు.

అందులో ఉన్న 30 మంది ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. బస్సు ముందు బాగా మంట పూర్తిగా డామేజ్ అయ్యిందన్నారు. నంద్యాల జిల్లాలో ఇటీవల కాలంలో ఈ రహదారిపై రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయి. పోలీసులు స్టాప్ అండ్ గో విధానం ద్వారా బస్సులును అపి ముఖం కడిగించి పంపించినప్పటికీ ఈ ప్రమాదాలు చేసుకోవటం విశేషం. ఈ ప్రైవేట్ ట్రావెల్ బస్సు ముందుగా వెళుతున్న బొగ్గు లారీ లోడును ఓవర్ టేక్ చేయటం అతి స్పీడ్ గా రావటంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుగుతున్నట్లు తెలిపారు.

Leave a Reply