VEHICLE| గుంతల్లో ఇరుక్కుపోయిన వాహనం..

VEHICLE| మక్తల్, ఆంధ్రప్రభ: మక్తల్ నుంచి జిల్లా కేంద్రం నారాయణపేటకు వెళ్లే రహదారి అధ్వాన్న స్థితికి చేరుకుంది. మక్తల్ పట్టణంలోని నారాయణపేట క్రాస్ రోడ్ నుంచి నారాయణపేటకు వెళ్లే రహదారి దాదాపు అర కిలోమీటర్ పెద్దపెద్ద గుంతలు పడి అధ్వాన్న పరిస్థితి నెలకొంది. అద్వాన్న స్థితిలో పేట రోడ్డు వాహనదారుల ఆగచాట్లు పట్టించుకోని అధికారులు అంటూ ఇటీవలే ఆంధ్రప్రభలో వార్తా కథనం రావడం జరిగింది. అయినప్పటికీ ఆర్ అండ్ బి అధికారులు ఏమాత్రం చలనం లేకుండా పోవడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ రోడ్డుపై ప్రతినిత్యం వందలాది వాహనాలో తిరుగుతూ రోజు ఏదో ఒక వాహనం గుంతల్లో ఇరుక్కుని అవస్థలు పాలు కావడం పరిపాటిగా మారింది. శనివారం మరోసారి ఓ వాహనం ఈ రోడ్డు గుంతల్లో ఇరుక్కుపోయింది. వాహనాన్ని బయటకు తీసేందుకు డ్రైవర్ నానా అవతలపడ్డప్పటికీ బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.చాలా సేపు ప్రయత్నించినా వాహనం బయటకు రాలేదు. ఈ క్రమంలో చేసి దెబ్బతిన్నట్లు లారీ డ్రైవర్ తెలిపారు.

దాదాపు పెద్ద మొత్తంలో మరమ్మతులకు ఖర్చు అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త రోడ్డు వేయకపోయినా పర్వాలేదు కానీ కనీసం మరమ్మతులు చేపట్టినా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం లేకుండా పోతుందని వాహనదారులు స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా కనీసం రోడ్డు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply