ఊట్కూర్ మండలంలో ముమ్మరంగా ఎస్ఐఆర్ నమోదు.
సర్ నమోదు కార్యక్రమంలో బిజీబిజీగాఅధికారులు.
ఊట్కూర్, ఆంధ్రప్రభ : భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చేపడుతున్న ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలో ముమ్మరంగా కొనసాగుతోంది. బుధవారం ఊట్కూర్ గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఎం. రేణుక భరత్, కొల్లూరు గ్రామంలో సర్పంచ్ సింగారం సువర్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఎల్వోలు, బీఎల్ఏలతో కలిసి నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. తహసీల్దార్ అశోక్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ చింత రవి, సీనియర్ అసిస్టెంట్ రాఘవేంద్ర రెడ్డి, ఆర్ఐలు కృష్ణారెడ్డి, వెంకటేష్ ప్రక్రియను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా తహసీల్దార్ అశోక్ కుమార్ మాట్లాడుతూ, ఈ నెల 24వ తేదీలోగా అర్హులైన ప్రతి ఓటరు ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని, అవసరమైన పత్రాలను సంబంధిత బీఎల్వోలకు అందించి ఎన్నికల జాబితాలో తమ వివరాలను సక్రమంగా నమోదు చేసుకోవాలని సూచించారు. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలు ఈ ప్రక్రియలో చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
