KBR Park Traffic | వన్‌వే ట్రయల్‌పై జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసుల సమీక్ష..
రద్దీ, సమస్యలపై క్షేత్రస్థాయి పరిశీలన
కమిషనర్లు ఆర్‌వీ కర్ణన్, సజ్జనార్ ప్రత్యక్ష తనిఖీ..
మెరుగైన ట్రాఫిక్ నిర్వహణపై అధికారులకు సూచనలు
KBR Park Traffic | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : నగరంలోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో అమలు చేస్తున్న వన్‌వే ట్రాఫిక్ విధానాన్ని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు. ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, వాహనాల రాకపోకల నిర్వహణపై అధికారులు క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. వన్‌వే ట్రయల్ అమలుతో ఎదురవుతున్న ఇబ్బందులు, వాహనాల రద్దీ పరిస్థితులు, ట్రాఫిక్ నిర్వహణలో ఉన్న సవాళ్లను ఉన్నతాధికారులు పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా, రద్దీని తగ్గించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు.
ఈ తనిఖీలో ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ సంతోష్, జాయింట్ సీపీ (ట్రాఫిక్) జోయెల్ డేవిస్, డీసీపీ (ట్రాఫిక్) కాజల్‌తో పాటు జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ విభాగాలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం చేపట్టిన మార్పులపై ప్రజల స్పందన, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.
https://twitter.com/muchatlu_/status/2077228918650929338/video/1
