అమరరాజా ప్రతినిధుల తీరుపై ఆగ్రహం.. సీఎం కార్యక్రమాన్ని బహిష్కరించిన జర్నలిస్టులు

పాలమూరు (ఆంధ్రప్రభ): పాలమూరు రూరల్ మండల పరిధిలోని అమరరాజా కంపెనీలో బుధవారం నిర్వహించిన నూతన ప్రొడక్షన్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన జర్నలిస్టుల పట్ల సంస్థ ప్రతినిధులు అగౌరవంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ మీడియా ప్రతినిధులు కార్యక్రమాన్ని బహిష్కరించారు.

జర్నలిస్టుల పట్ల వ్యవహరించిన తీరుపై నిరసన వ్యక్తం చేసిన మీడియా ప్రతినిధులు, ముఖ్యమంత్రి పాల్గొన్న కార్యక్రమానికి హాజరుకాకుండా బహిష్కరణ చేపట్టారు.