అంజన్న ఆలయ పునః నిర్మాణానికి విరాళం అందజేత

ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ శ్రీ పడమటి ఆంజనేయస్వామి ఆలయ పునః నిర్మాణానికి దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందజేస్తున్నారు. గురువారం ఊట్కూర్ మండల పరిధిలోని బిజ్వార్ పడమటి అంజన్న దేవాలయ పునః నిర్మాణానికి యాదమ్మ రాములు గౌడ్ దంపతులు రూ 101116 విరాళం అందజేశారు.
ఈ సందర్భంగా దేవాలయ కమిటీ అధ్యక్షులు దోరోళ్ల కృష్ణయ్య మాట్లాడుతూ ఆలయ పునర్నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ నిర్మాణం భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పూజారి నరసింహ చారి, వార్డు సభ్యులు నేడుగం రాఘవేంద్ర, నాయకులు హన్మిరెడ్డి, పత్తి ఆంజనేయులు, రాములు, ఉప్పు ఆంజనేయులు, గున్నపోల్ల నర్సింహా తదితరులు పాల్గొన్నారు.
