Science Center | శాస్త్రీయ ఆలోచనలు పెంపొందించుకోవాలి

అల్వాల్‌లో ఎఫ్‌డీఆర్ సైన్స్ సెంటర్ ప్రారంభించిన మంత్రి

Science Center | హైద‌రాబాద్, ఆంధ్ర‌ప్ర‌భ : అల్వాల్ జెడ్పీహెచెస్ బాలికల ఉన్నత పాఠశాలలో ఎఫ్‌డీఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైన్స్ సెంటర్‌ను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. విద్యార్థుల్లో పరిశోధనాత్మక, ప్రయోగాత్మక విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు వి. విజయేంద్ర ప్రసాద్, ఎంపీ ఈటల రాజేందర్, ఎఫ్‌డీఆర్ వ్యవస్థాపకుడు డాక్టర్ జయప్రకాష్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.