Utkoor | సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ…

Utkoor | సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ…

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : రాష్ట్ర పాడి పరిశ్రమల మత్స్య శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి సహకారంతో బాధితుడికి సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ చేసినట్లు అమీన్ పూర్ సర్పంచ్ టప్ప నాగేష్ అన్నారు. ఈ రోజు నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని ఆమీన్ పూర్ గ్రామానికి చెందిన వడ్ల శివకు 60 వేల సీఎం సహాయనిధి చెక్కు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారికి సీఎం సహాయనిధి వరం లాంటిదని అన్నారు. తమ గ్రామానికి చెందిన వడ్ల శివ అనారోగ్యానికి గురికావడంతో మంత్రి దృష్టికి తీసుకువెళ్లగా తక్షణమే సీఎం సహాయ నిధి ద్వారా సహాయం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్ గౌడ్, ఉపసర్పంచ్ రవీందర్ రెడ్డి, వార్డ్ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, మాజీ ఎంపీటీసీ అనిత శేఖర్ రెడ్డి, మొగల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply