Mothkur ప్రైవేటు పాఠశాల బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు
Mothkur ప్రైవేటు పాఠశాల బస్సులను అడ్డుకున్న గ్రామస్తులు
.. ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు తీర్మానం
మోత్కూర్ (Mothkur), ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు పాఠశాలల బస్సులను గ్రామంలోకి రానివ్వకుండా గ్రామస్తులు, పాలకవర్గం అడ్డుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం పొడిచేడు గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.
గ్రామ సర్పంచ్ జిట్ట సైదులు ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ గ్రామసభ నిర్వహించి, గ్రామంలోని విద్యార్థులు తప్పనిసరిగా స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లోనే చదవాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ నేపథ్యంలో మోత్కూర్‌కు చెందిన అక్షర, లిటిల్ ఫ్లవర్, అలాగే అమ్మనబోలు ప్రాంతానికి చెందిన న్యూ బ్రిలియంట్ స్కూల్ బస్సులు గ్రామంలోకి ప్రవేశించకుండా గ్రామస్తులు అడ్డుకున్నారు.
వార్డు సభ్యులు రచ్చ శివకుమార్, నల్ల రామనర్సయ్య, కడమంచి వెంకటేష్, కడమంచి రాంబాబు, ఓర్సు మల్లేష్, ఓర్సు గోపి, ఓర్సు వెంకన్న, బలికే లక్ష్మయ్య, అంబటి దామోదర్, జిట్టగిరి, పి నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
గ్రామంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను పంపవద్దని ప్రజలకు అవగాహన కల్పించినట్లు సర్పంచ్ సైదులు తెలిపారు.
