Orkonda | అంజన్న సన్నిధిలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

Orkonda | ఊర్కొండ, ఆంధ్రప్రభ : ఉమ్మడి జిల్లాలోని పేరుగాంచిన ఊరుకొండపేట శ్రీ పబ్బతి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలలో ఈ రోజు కల్వకుర్తి శాసనసభ్యుడు కసిరెడ్డి నారాయణరెడ్డి పాల్గొని అంజన్న స్వామిని దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయ అర్చకులు అధికారులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. అనంతరం వారు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు బృంగి ఆనంద్ కుమార్, బాలాజీ సింగ్, ద్యాప నిఖిల్ రెడ్డి, చంద్రకాంత్ రెడ్డి, రమేష్ నాయక్, వెంకటేష్, సురేష్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.
