urea | మొండ్రాయి రైతువేదికకు తాళం

urea | మొండ్రాయి రైతువేదికకు తాళం
- కనిపించని ఏఈఓ
urea | సంగెం, ఆంధ్రప్రభ : మండలంలోని మొండ్రాయి గ్రామానికి చెందిన రైతు వేదికకు తాళం వేసి ఉంది. ఏఈఓ ను కలవాలని వచ్చిన రైతులకు తాళం వేసిన రైతు వేదిక(Farmer’s platform) దర్శనం ఇవ్వడంతో అసంతృప్తితో రైతులు వెనుతిరుగుతున్నారు. యూరియా కోసం బుక్కులు రాయించుకుందామని కొందరు, కిసాన్ రైతు పాస్ బుక్ లో రాయించుకుందామని మరికొందరు మొండ్రాయి రైతు వేదికకు రాగా, ఏఈఓ కనిపించడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
దీనికి ఆంధ్రప్రభ ప్రతినిధి సదరు ఏఈఓను వివరణ కోరగా… నేను పల్లారగూడలో యూరియా టోకెన్(urea token) ఇస్తున్నానని.. తనకు 10 గ్రామాల ఇన్చార్జిగా ఇచ్చారని, అందుకే రైతు వేదికలో లేనని వివరణ ఇచ్చారు. ఒక ఏఈఓ పది గ్రామాల ఇన్చార్జిగా ఉండడం ఏఈఓను కలవాలంటే డేట్ తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇకనైనా అధికారులు స్పందించి ఏఈఓల కొరత లేకుండా చూడాలని పలువురు రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
