అభయ ఫౌండేషన్ నిత్య అన్నదానం ప్రారంభం

అభయ ఫౌండేషన్ నిత్య అన్నదానం ప్రారంభం

  • బడుగు బలహీన వర్గాల వారికి చేయూత
  • 19 నుండి నిత్య అన్నదానం ప్రారంభం
  • నిర్వాకులు పోలేపాక అంబు కీర్తి వెల్లడి

కరీమాబాద్, ఆంధ్రప్రభ ; గ్రేటర్ వరంగల్ లోనీ అభయ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ నుండి మే 19 నుండి నూతన భవనం ప్రారంభించడం జరుగుతుందని ట్రస్టు నిర్వాహకులు పోలేపాక అంబు కీర్తి వెల్లడించారు. మంగళవారం ఉదయం 34 వ డివిజన్ ప్రాంతీయ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో అంబు ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు కీర్తి మాట్లాడుతూ.. తమ సంస్థ 2023 న ప్రారంభించడం జరిగిందని తెలిపారు.నూతన ట్రస్ట్ భవనాన్ని ఈనెల 19న కీర్తి నగర్ లో ప్రారంభిస్తున్నామని ఆ రోజు నుండి నిత్య అన్నదాన కార్యక్రమం ప్రారంభిస్తున్నామని కీర్తి తెలిపారు.

తమ ట్రస్టు ద్వారా బడుగు బలహీన వర్గాల వారికి చేయూతనివ్వడం, వృద్ధులకు ఒంటరి మహిళలకు ఉపాధి కల్పించడం నిరుపేదలకు గృహ నిర్మాణం కొరకు సహాయం అందించడం, పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివించేందుకు తమ ట్రస్టు ఆర్థిక సహాయం అందజేస్తుందని తెలిపారు. నిరుద్యోగులైన యువతి యువకులకు స్కిల్స్ నేర్పించడం తదనంతరం ఉపాధి కొరకుచిన్న పరిశ్రమల ఏర్పాటుకు సహాయం చేస్తున్నామని, ప్రింటింగ్ ప్రెస్, ఇస్తారా కుల తయారీ, ప్లాస్టిక్ గ్లాసుల తయారీ తదితర స్కిల్స్లో శిక్షణ ఇచ్చి వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. నిరుపేద మహిళలకు టైలరింగ్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పలువురికి కుట్టు మిషన్లు అందజేయడం జరిగిందని తెలిపారు. సమావేశంలో ట్రస్ట్ సిబ్బంది, మంద రవికుమార్ శ్రీలేఖ, కిరణ్మయి, సిబ్బంది పాల్గొన్నారు.