దారిని తవ్విన గుర్తు తెలియని వ్యక్తులు..

జైపూర్, ఆంధ్రప్రభ : జైపూర్ మండలం రసూల్ పల్లి నుంచి ఇందారం గ్రామానికి వెళ్లే మట్టి దారిని బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొవ్వేశారని, దీంతో తాము పొలాలకు వేళ్లే దారి లేకుండా పోయిందని ఆ గ్రామ రైతులు వాపోతున్నారు.

పూర్వ కాలం నుంచి ఈ మట్టి దారి ఉందని.. రైతులు దారి గుండా వెళ్తూ పొలాలను సాగు చేసుకోవడం జరుగుతుందని తెలిపారు. దారి తవ్వడం ద్వారా తమ పొలాలకు వెళ్లేందుకు మార్గం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఈ మార్గమధ్యలో ఇటీవల కాలంలో కొన్ని వెంచర్లు వెలిసాయని.. కాగా కొన్ని వెంచర్ల నిర్వాహకులు కమీషన్లు ఇవ్వలేదనే నెపంతోనే అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు రోడ్డును తవ్వి ఉంటారని గ్రామస్తులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

దీనితో పాటు ఓ వెంచర్ కు వెళ్లే ప్రధాన ద్వారం ముందు కూడా తవ్వడం గమనార్హం. దారిని తవ్విన వారిపై మండల అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.

Leave a Reply