గిరిజన గ్రామాల్లో వైద్య శిబిరాలు.. ఆరోగ్యంపై అవగాహన

జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని ఉషగాం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య ఉద్యోగులు మండలంలోని రామ్ నాయక్ తండా,కిషన్ నాయక్ తండ, సోంజిగూడ, సుభాష్ గూడ గిరిజన గ్రామాల్లో మంగళవారం వైద్య శిబిరాలు నిర్వహించారు. శిబిరాల కు వచ్చిన వారికి పరీక్షలు చేసి మందులు పంపిణీ చేశారు అనంతరం ఆయా గ్రామాల్లో డ్రై డే కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత వ్యాధుల నిర్మూలన తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వైద్య ఉద్యోగులు అవగాహన కల్పించారు. ఈ శిబిరాల్లో రామ్ నాయక్ తండా సర్పంచ్ రాథోడ్ రాందాస్, హెచ్ ఓ రమేష్ జాదవ్, హెల్త్ అసిస్టెంట్లు పెందూర్ భరత్, ప్రవీణ్ కుమార్,జంగు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, ప్రజలు పాల్గొన్నారు.