రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ సభ్యులుగా విరాహత్ అలీ నియామకం

గజ్వేల్, ఆంధ్రప్రభ ; రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యులుగా తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్( టీయూ డబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు ఖాజావిరాహత్ అలీని మరోసారి నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఎలాంటి ఒత్తిడిలకు లొంగకుండా నిష్పక్షపాతంగా, నిజాయితీగా బాధ్యతలు నిర్వర్తించే విరాహత్ అలీని, 2014 నుంచి వరసగా రాష్ట్ర మీడియా అక్రెడిటేషన్ కమిటీ సభ్యులుగా రాష్ట్ర పౌర సంబంధాలు, సమాచార శాఖ నియమిస్తూ వస్తుంది. వృత్తి ధర్మాన్ని అంకితాభావంతో, నిబద్దతో నిర్వర్తించే జర్నలిస్టులకే అక్రెడిటేషన్ కార్డులు దక్కేలా తన గొంతును వినిపించే విరాహత్ అలీ, రాష్ట్ర అక్రెడిటేషన్ కమిటీ సభ్యులుగా గత పన్నెండ్ల నుండి కొనసాగుతున్న నేపథ్యంలో జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా విరాహాత్ అలీ మాట్లాడుతూ, పవిత్రమైన జర్నలిజం వృత్తిని బ్లాక్ మెయిల్ చర్యలతో అపవిత్రం చేసేందుకు ప్రయత్నించే శక్తులకు తగిన రీతిలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అర్హులైన జర్నలిస్టులకే అక్రెడిటేషన్ కార్డులు అందించేలా పకడ్భందీ చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేసారు. 33జిల్లాల్లో అక్రెడిటేషన్ కమిటీ సభ్యులను నియమిస్తూ ఆయా జిల్లా కలెక్టర్లకు తమ సంఘం నుండి ప్రతిపాదనలు పంపించినట్లు విరాహత్ తెలిపారు.

Leave a Reply