చెన్నూరులో తెలంగాణ రక్షణ సమితి ఆరంభం..
చెన్నూర్, ఆంధ్రప్రభ : చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రక్షణ సమితి పార్టీ కార్యకలాపాలు ఆ పార్టీ నాయకులు ప్రారంభించారు. టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గ్రామా గ్రామానా తెలంగాణ రక్షణ సమితి జెండా అనే పిలుపుమేరకు నాయకులు చెన్నూరు పట్టణంలో పార్టీ జండాను ఆవిష్కరించి ప్రధాన విధులలో జై టీఆర్ఎస్, తెలంగాణ రక్షణ సమితి జిందాబాద్ అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు.
