Mail | బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

Mail | బాంబ్ స్క్వాడ్ తనిఖీలు

Mail | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మహారాష్ట్ర శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. అయితే శాసనసభకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ మెయిల్ వచ్చిన వెంటనే బాంబ్ స్క్వాడ్ సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టింది. అధికారులు అప్రమత్తమై అక్కడున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇటీవల దేశవ్యాప్తంగా ఇలాంటి బెదిరింపులు తరచుగా వస్తున్న నేపథ్యంలో.. ఈ బెదిరింపు నిజమా లేక కల్పితమా అనేది పోలీసుల విచారణలో తేల్చనున్నారు.

Leave a Reply